ఏపీలో తొలిసారిగా క్రీడాప్రతిభా పురస్కారాలు | Sports Talent Award Will Be Given For The First Time In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో తొలిసారిగా క్రీడాప్రతిభా పురస్కారాలు

Aug 15 2021 8:57 AM | Updated on Aug 15 2021 10:00 AM

Sports Talent Award Will Be Given For The First Time In AP - Sakshi

కడప : రాష్ట్రంలో తొలిసారిగా పాఠశాల స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరచిన పాఠశాలలకు ‘క్రీడాప్రతిభా అవార్డు’లను అందజేయనున్నట్లు ఏపీ వ్యాయామ విద్య తనిఖీ అధికారి, ఏపీ ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి జి. భానుమూర్తిరాజు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్య, ఏపీ ఎస్‌జీఎఫ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పురస్కారాలను ఈనెల 29వ తేదీన అన్ని జిల్లాల్లో ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన పాఠశాలలను ఐదింటిని ఎంపికచేసి అవార్డులను ప్రదానం చేస్తామని తెలిపారు. ఈనెల 18వ తేదీలోపు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తమ క్రీడాప్రగతికి సంబంధించిన సర్టిఫికెట్లు జిరాక్స్‌లతో ఆయా జిల్లాల్లో విద్యాశాఖాధికారి, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులకు అందజేయాలన్నారు. 18, 19 తేదీల్లో స్రూటినీ, 21న ప్రాథమిక జాబితా, 22న అభ్యంతరాలు స్వీకరణ, 23న తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement