కాచిగూడ–ఖుర్దారోడ్డు మధ్య ప్రత్యేక రైలు | Special train between Kachiguda Khurda Road | Sakshi
Sakshi News home page

కాచిగూడ–ఖుర్దారోడ్డు మధ్య ప్రత్యేక రైలు

Jun 22 2023 4:10 AM | Updated on Jun 22 2023 10:25 AM

Special train between Kachiguda Khurda Road - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా కాచిగూడ–ఖుర్దారోడ్డు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాచిగూడ–ఖుర్దారోడ్డు (07223) రైలు ఈ నెల 24న రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు ఖుర్దారోడ్డు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07224) ఈ నెల 25న ఖుర్దారోడ్డులో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటల­కు కాచిగూడ చేరుతుంది. రెండు మార్గా­లలో ఈ రైలు మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ,  సింహాచలం, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బెరంపూర్‌ స్టేషన్లలో ఆగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement