Diwali: ఈ టపాసులు తినెయ్యొచ్చు

Special Story On Diwali Chocolate Crackers - Sakshi

చాక్లెట్‌ బొకేలతో వినూత్న ఒరవడి 

మండపేట: చిచ్చుబుడ్లు.. వెన్నముద్దలు.. లక్ష్మీ ఔట్లు.. భూచక్రాలు.. రాకెట్లు.. ప్రమిదలు.. ఇవన్నీ నిజమైన దీపావళి బాణ సంచా అనుకుంటే పొరబాటే. బాణ సంచాను తలపించే మధురమైన చాక్లెట్లు. వినూత్న రీతిలో బోకేల తయారీ ద్వారా శుభాకాంక్షలు తెలపడంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు మండపేటకు చెందిన రోటరీక్లబ్‌ సభ్యురాలు మల్లిడి విజయలక్ష్మి.

(చదవండి: దీపావళి రోజున ఇలా చేయండి

ఇంటి వద్దనే ప్లెయిన్, ఎనర్జీటిక్‌ బార్స్, లాలీపప్స్‌ తదితర చాక్లెట్లతో అందమైన ఆకృతుల్లో బొకేలు తయారుచేస్తూ పలువురికి ఉపాధి చూపిస్తున్నారు. పూలబొకేలు రెండు మూడు రోజుల్లో వాడిపోతే ఈ చాక్లెట్‌ బొకేలు రెండుమూడు వారాలు నిల్వ ఉండటంతో పాటు ఆత్మీయులకు మాధుర్యాన్ని అందిస్తూ వారి ఆదరణ చూర గొంటున్నాయి. భర్త శ్రీనివాసరెడ్డి రోటరీ గవర్నర్‌ కాగా వీటిపై వచ్చే ఆదాయంతో ఆయనతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు విజయలక్ష్మి.

(చదవండి: తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి: సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top