బాలకోటిరెడ్డిని చంపేందుకు డీల్‌ కుదిరింది.. 60వేలతో గన్‌ కొన్నారు..

SP Ravi Shankar Comments Palnadu Gun Fire On TDP Balakotireddy - Sakshi

సాక్షి, పల్నాడు: రొంపిచర్ల మండలం అలవాలలో టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరిపి.. పరారయ్యారు. ఈ ఘటనలో బాలకోటిరెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా, ఈ కాల్పులపై ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ ఘటనపై ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బాలకోటిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డికి మధ్య వివాదాలు ఉన్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలే కాల్పులకు కారణం. ఎంపీటీసీ పదవి ఇప్పిస్తానని వెంకటేశ్వర రెడ్డి వద్ద బాలకోటిరెడ్డి రూ.6.50 లక్షలు తీసుకున్నాడు. బాలకోటిరెడ్డిని చంపడానికి రూ.4.50 లక్షల డీల్‌ జరిగింది. రాజస్థాన్‌ నుంచి రూ.60వేలకు గన్‌ కొన్నారు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తి శివారెడ్డి పేరుతో డోర్‌ తట్టారు. ఈ క్రమంలో తలుపు తీసిన వెంటనే బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపాడు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశాము అని తెలిపారు.

ఇదికూడా చదవండి: పల్నాడు: రొంపిచర్ల టీడీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top