Viral: Snakes Came Out From Anthill Due To Over Heat In Srikakulam - Sakshi
Sakshi News home page

మండిన ఎండ..పుట్ట నుంచి బయటకొచ్చిన పాములు 

Jul 18 2021 8:53 PM | Updated on Jul 19 2021 9:23 AM

Snakes Come Out From Ant Colony Due To Overheat - Sakshi

పుట్ట నుంచి వచ్చిన పాములు   

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎండ తీవ్రత శనివారం ఎక్కువగా ఉంది. వేడిని తట్టుకోలేక ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్‌ సమీపంలోని గృహ నిర్మాణశాఖ నిర్మిత కేంద్రం అవరణలో ఉన్న పుట్ట నుంచి ఒక్క సారిగా ఐదు పాములు బయటకు వచ్చాయి. దీన్ని చూసిన అక్కడ ఉన్నవారు భయానికి గురయ్యారు. పుట్ట నుంచి బయటకు వచ్చిన పాములు సమీపంలోని తుప్పల్లోకి జారుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

సర్పాల సయ్యాట 
ఆమదాలవలస రూరల్‌: శ్రీహరిపురం గ్రామం సమీపంలోని కొండ ప్రాంతంలో శనివారం రెండు సర్పాలు సయ్యాట ఆడాయి. నాగు, జెర్రీ జాతులకు చెందిన పాముల సయ్యాటను స్థానికులు ఆసక్తిగా తిలకించి సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement