కంపించిన నాయనబావి

Small Earthquake In Nayanabavi Village Chittoor District - Sakshi

బి.కొత్తకోట (చిత్తూరు): చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావిలో శనివారం మధ్యాహ్నం 3.00 నుంచి 3.15 గంటల మధ్య భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భీకరమైన శబ్దాలు వినిపించటంతో ఇళ్లలో, దుకాణాల్లో ఉన్న వారంతా భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఎందుకు శబ్దాలు వస్తున్నాయో అర్థం కాక చాలా భయపడిపోయామని, తర్వాత గమనిస్తే ఒకరిద్దరి ఇళ్ల గోడలు బీటలు వారాయని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

చదవండి: చింతపల్లి @ 5.6 డిగ్రీలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top