ఏపీ గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియా బాధ్యతలు

Sisodia Appointed Special Chief Secretary To Andhra Pradesh Governor - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ఆర్పి సిసోడియా సోమవారం బాధ్యతలు చేపట్టారు.  ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. 1991 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సిసోడియాను గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్‌గా కీలక బాధ్యతల్లో ఉన్నారు.

చదవండి: చలానా పెండింగ్‌ ఉంటే బండి సీజ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top