చలానా పెండింగ్‌ ఉంటే బండి సీజ్‌

Hyderabad Traffic Police Says Challan Pending People Vehicle May Be Seized - Sakshi

90 రోజులు దాటితే వాహనం జప్తు 

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు  

సాక్షి, సిటీబ్యూరో: ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నా వాహనాన్ని జప్తు చేసే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు లేదని.. తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లుగా పేర్కొంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్‌ అవాస్తవమని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తేల్చారు. హైకోర్టు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని ఆపేయాలని హెచ్చరించారు.

చదవండి: డేంజర్‌ డెంగీ

సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్‌ రూల్స్‌ (సీఎంవీఆర్‌)–1989 రూల్‌ 167 ప్రకారం 90 రోజులకు పైగా ట్రాఫిక్‌ చలానాలు పెండింగ్‌ ఉన్న వాహనాలను అదుపులోకి తీసుకునే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు ఉందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. సంబంధిత పెండింగ్‌ చలానా గురించి వాహనదారునికి ఎలక్ట్రానిక్‌ రూపంలో లేదా కాల్‌ ద్వారా పోలీసులు ఒక్కసారైనా తెలియజేస్తే చాలని పేర్కొన్నారు.

చదవండి: సీసీఎస్‌ బకాయిల కోసం రూ.500 కోట్లు

ఏమైనా ట్రాఫిక్‌ ఉల్లంఘన చలానాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేసుకోవాల్సిన బాధ్యత వాహనదారులదే. ఒకవేళ వాహనదారులు ఏమైనా వ్యత్యాసం గమనిస్తే ఆన్‌లైన్‌ ద్వారా అధికారులకు నివేదించవచ్చు. సాక్ష్యాలను ధ్రువీకరించి సరిదిద్దుకోవచ్చని వారు సూచించారు.

చదవండి: ఏఐబీపీ ప్రాజెక్టులన్నీ పూర్తికావాల్సిందే!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top