వాడవాడలా ‘రెండేళ్ల’ వేడుకలు

Service programs across AP on occasion of second anniversary YS Jagan Rule - Sakshi

వైఎస్‌ జగన్‌ సీఎం పదవి చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

సాక్షి నెట్‌వర్క్‌: సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీబాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేక్‌ కట్‌చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయాల గురించి తెలిపారు.

కరోనా కష్టకాలంలోను అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి దక్షతను కొనియాడారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు నవాజ్‌బాష, ఎంఎస్‌.బాబు, శ్రీనివాసులు, ఆదిమూలం పాల్గొన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కరోనా అంతమయ్యేవరకు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు తన సొంత నిధుల నుంచి ప్రతినెల రూ.5 లక్షల ఆర్థిక ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు.

చంద్రగిరి కోవిడ్‌ ఆస్పత్రి, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రతినెల ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున ఆర్థిక భరోసా కల్పిస్తానన్నారు. దీనికి సంబంధించిన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి 100 తోపుడు బండ్లను వితరణగా అందించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూరగాయలు, పండ్ల మార్కెట్‌ల వద్ద ప్రజలు గుమికూడకుండా చూసేందుకు వారి ఇళ్ల వద్దకే చిరువ్యాపారులు వచ్చి విక్రయించేలా తోపుడు బండ్లు వితరణగా ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు.  
పశ్చిమగోదావరి జిల్లా తూర్పుపాలెంలో వైఎస్సార్‌సీపీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు   

అబ్బురపరిచిన చిత్రకళా ప్రతిభ 
గుంటూరు జిల్లాలో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, గుంటూరు ఈస్ట్, వెస్ట్, చిలకలూరిపేట, నరసరావుపేట, పెదకూరపాడు, పొన్నూరు, సత్తెనపల్లి, వేమూరు, వినుకొండ, తెనాలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ జెండా ఆవిష్కరించి కేక్‌ కట్‌చేశారు. తెనాలిలో ఇంజినీరింగ్‌ విద్యార్థి దాసరి యశ్వంత్‌.. ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే శివకుమార్‌లతో పాటు వారిద్దరి తండ్రులు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, అన్నాబత్తుని సత్యనారాయణ బొమ్మలతో సీఎంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న చిత్రాన్ని స్వల్ప వ్యవధిలో చిత్రీకరించి ఎమ్మెల్యేకి బహూకరించారు.

రెండు చేతులతోను ఎదురెదురుగా బొమ్మలు వేస్తూ, మధ్యలో నోటితో చిత్రీకరిస్తూ.. చకచకా చిత్రం రూపొందించటం అందరినీ ఆకట్టుకుంది. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, బడ్ఢుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగారావు, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లాలో జరిగిన వేడుకల్లో ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్‌గణేష్‌, గొల్ల బాబురావు, కరణం ధర్మశ్రీ, చెట్టి ఫాల్గుణ, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ సమన్వయకర్తలు కె.కె రాజు, మళ్ల విజయప్రసాద్, అక్కరమాని విజయనిర్మల, డిప్యూటీ మేయర్‌ కె.సతీష్‌ పాల్గొన్నారు. వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
పారిశుధ్య కార్మికులకు చెక్కును అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి  

అనంతపురం జిల్లాలో మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వై.వెంకట్రామిరెడ్డి, ఉషాశ్రీచరణ్, జొన్నలగడ్డ పద్మావతి, డాక్టర్‌ తిప్పేస్వామి, డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శమంతకమణి, మహమ్మద్‌ ఇక్బాల్, ప్రాథమిక విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సీఈవో సాంబశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, ఎంపీ, వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌రామ్, పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ భరత్‌రామ్‌ తదితరులు పాల్గొన్నారు.  

వైఎస్‌ విగ్రహానికి గజమాలతో నివాళి 
కృష్ణా జిల్లావ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కేక్‌ కట్‌చేశారు. విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌ రూం ఎదురుగా ఉన్న వైఎస్సార్‌ పార్కులో ఉన్న దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు బొత్స, వెలంపల్లి శ్రీనివాసరావు క్రేన్‌ సహాయంతో గజమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్‌ రాయన భాగ్యలక్షి్మ, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ గౌతంరెడ్డి, డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడు, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్‌ పాల్గొన్నారు.

పులివెందులలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి జూమ్‌ యాప్‌ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలతో వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎం.సుదీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్ బాబు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, నాయకుడు వైఎస్‌ మనోహర్‌రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, కిరణ్‌కుమార్, రెడ్డి శాంతి పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, డాక్టర్‌ సుధాకర్, చెన్నకేశవరెడ్డి, కర్నూలులో మేయర్‌ బీవై రామయ్య పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు నాగార్జునరెడ్డి, బుర్రా మధుసూదన్‌, అన్నా రాంబాబు, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేష్, మాదాసి వెంకయ్య, బాచిన కృష్ణచైతన్య, సింగరాజు వెంకట్రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రావి రామనాథంబాబు కేక్‌ కట్‌ చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top