‘పవన్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి’ | Sedition case registered against Pawan Kalyan: Pilli Baburao | Sakshi
Sakshi News home page

‘పవన్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి’

Oct 15 2024 4:47 AM | Updated on Oct 15 2024 4:47 AM

Sedition case registered against Pawan Kalyan: Pilli Baburao

నగరంపాలెం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ రాజ్యాంగ పదవిలో ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నందువల్ల.. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని జైభీమ్‌ కార్మిక సంక్షేమ సంఘం కూటమి అధ్యక్షుడు పిల్లి బాబురావు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ బంగ్లారోడ్డులోని గుంటూరు రేంజ్‌ కార్యా­లయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠికి గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవా­రం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆయన, కూటమి సభ్యులు ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని  ఎవరైనా హేళన చేస్తే వారి అంతు చూస్తానంటూ బలవంతపు హిందూ మత­మా­ర్పిడులను ప్రేరేపిస్తున్నారని, ఇది రాజ­కీయకుట్ర అని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ప్రధాని మోదీ కూడా ఉన్నారని, వారివురిపై దేశద్రోహం, రాజద్రోహం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అనేక పెండింగ్‌ అంశాలు ఉన్నాయని, వాటిని విస్మరించి లడ్డూలపై తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు.  కూటమి సభ్యులు ఎన్‌.నీలాంబరం, కొండపల్లి విల్సన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement