ట్యాబ్‌ల వినియోగంపై శాస్త్రీయ శిక్షణ | Scientific training on the use of tabs | Sakshi
Sakshi News home page

ట్యాబ్‌ల వినియోగంపై శాస్త్రీయ శిక్షణ

Published Thu, Aug 31 2023 4:09 AM | Last Updated on Thu, Aug 31 2023 4:00 PM

Scientific training on the use of tabs - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తర­గతి విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యా­బ్‌­ల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారి­ంచింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పాఠ­శా­ల­ల ను విద్యాశాఖ ఐటీ బృందం స్వయంగా పరి­శీలించి ట్యాబ్‌ల పనితీరును పరీక్షిస్తోంది. విద్యా­ర్థులకు గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం 5,18,740 ట్యాబ్‌­లను బైజూస్‌ కంటెంట్‌తో పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి 10 రోజుల పాటు అ న్ని పాఠశాలల్లోనూ ఈ బృందం అన్ని ట్యాబ్‌­లను పరిశీలిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ఐటీ నోడల్‌ ఆఫీ సర్‌ సీహెచ్‌ రమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో బృందం ఈ ప్రక్రియను ప్రారంభించింది.

మండలానికి ఇ ద్దరు ఐటీ నేపథ్యం ఉన్న ఉపాధ్యాయుల చొప్పున 1,360 మందితో పాటు జిల్లా నోడల్‌ ఆఫీ­సర్లు కూ డా ఇందులో పాలుపంచుకుంటు­న్నారు. తొలుత సాంకేతిక సమస్యలపై దృష్టిపెట్టనున్నారు. సమస్య­లను పరిష్కరించడంతో­పాటు వాటి వినియోగంపై విద్యార్థులు, ఉపాధ్యా­యులకు శిక్షణ తరగతులు ని ర్వ­హిస్తున్నారు. వాస్త­వా­నికి ట్యాబ్‌లో ఇచ్చిన కంటెంట్‌ తప్ప ఇంటర్‌నెట్‌ కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేసేందుకు, డౌన్‌లోడ్‌ చేసేందుకు అవకాశం లేకుండా ట్యాబ్‌ల సాఫ్ట్‌వేర్‌ రూపొ­ం­దించారు.

సరైన అవ­గా­హన లేక కొందరు విద్యా­ర్థులు యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసేందుకు యత్నించడంతో అవి సాంకేతికంగా ని­లి­­చి­పోతున్నాయి. ఎక్కడ తప్పు జరిగిందీ విద్యా­ర్థులు గుర్తించలేకపోవడంతో ఇబ్బందులు ఎదుర­వు­తు­న్నాయి. వీటిన్నింటికి పరి­ష్కా­రంగా విద్యా­శాఖ ఐటీ బృందం ఇప్పుడు అన్ని ట్యాబ్‌ల్లోనూ గూగుల్‌ అథెంటికేటర్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్‌ చేస్తోంది. 

డౌన్‌లోడ్‌కు యత్నిస్తే హెచ్‌ఎంకు మెసేజ్‌ 
విద్యార్థులకు అందించిన ట్యాబ్‌ల్లో ఎలాంటి మా ర్పు­­లు చేసినా వెంటనే ఉన్నత స్థాయిలోని వారికి ఓటీపీ మెసేజ్‌ వచ్చేలా ఐటీ బృందం చర్యలు తీ సుకుంటోంది. అన్ని ట్యాబ్‌ల్లోనూ గూగుల్‌ అథెంటి కేటర్‌ను ఇన్‌స్టాల్‌ చేయడం ద్వారా విద్యార్థి ట్యాబ్‌­లో మార్పులు చేసేందుకు యత్నిస్తే వెంటనే సంబంధిత స్కూలు హెచ్‌ఎంకు, రాష్ట్ర స్థాయిలోని కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బందికి, మండల స్థాయిలో ఐటీ సహాయ­కులుగా పనిచేసే ఉపాధ్యాయులకు సైతం సమాచా­రం వెళ్తుంది. దీంతో ఏ పాఠశాలలో ఏ విద్యార్థి తప్పు­­చేశారో సులభంగా తెలిసిపోతుంది.

ప్రసుత్తం ఉన్న ట్యాబ్‌లను సరైన రీతిలో విని యోగించకపోవ­డమే తప్ప.. వాటిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని స్టేట్‌ ఐటీ నోడల్‌ అధికారి రమేశ్‌ కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఇకపై ఆ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఏర్పాట్లు చేశామ న్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక సచి వాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌కు ట్యాబ్‌ల వినియో గంపై శాస్త్రీయ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement