ఆందోళన అవసరం లేదు: సామినేని ఉదయభాను

Samineni Udayabhanu Told No Need To Worry That Corona Was Positive - Sakshi

సాక్షి, కృష్ణా: కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రోజున ఆయన మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. తనకు జూలై 26వ తేదీన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. తాను చాలా ధైర్యంగా ఉన్నానని, ప్రజలు ఎవరూ కూడా తన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

పద్నాలుగు రోజుల హోం ఐసొలేషన్ తర్వాత కరోనా పరీక్ష చేయించడంతో నెగిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. త్వరలోనే మీ ముందుకు వస్తాను. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉండి, భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే దాచుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కరోనా పరీక్షలు చేసుకున్న వ్యక్తులు రిపోర్టులు వచ్చేంత వరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వ్యక్తులు వారి ప్లాస్మాని మరొకరికి దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. (అగ్నిప్రమాదంలో సామినేని సన్నిహితుడు మృతి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top