ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్‌ ప్రకారం జీతాలు 

Salaries of RTC employees as per new pay scale Andhra Pradesh - Sakshi

ఆర్థిక శాఖ ఆమోదం 

సెప్టెంబరు 1న కొత్త వేతనాలు  

సాక్షి, అమరావతి: ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) ఉద్యోగులకు కొత్త పే స్కేల్‌ ప్రకారం జీతాల చెల్లింపునకు అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త పే స్కేల్‌ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖతో మంగళవారం జరిపిన సంప్రదింపులు ఫలించాయి. ఆర్టీసీలో మొత్తం 51,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో దాదాపు 2 వేల మందికి ఇటీవల పదోన్నతులు కల్పించారు.

పదోన్నతులు పొందిన వారు మినహా మిగిలిన ఉద్యోగులు అందరికీ సెప్టెంబరు ఒకటిన కొత్త పే స్కేల్‌ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పదోన్నోతులు పొందిన వారి ఫైల్‌ను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. పదోన్నతులను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వారికి కూడా కొత్త పే స్కేల్‌ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతినిస్తుందని అధికారులు తెలిపారు.

వారం రోజుల్లో ప్రభుత్వ ఆమోదం లభిస్తే వీరికి కూడా సెప్టెంబరు ఒకటిన కొత్త పే స్కేల్‌ ప్రకారం జీతాలు చెల్లిస్తారు. లేకపోతే ఆక్టోబరు ఒకటి నుంచి కొత్త జీతాలు చెల్లిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ఎరియర్స్‌తో సహా జీతాలు చెల్లిస్తారని, ఎవరికీ ఇబ్బంది ఉండదని ఆర్టీసీవర్గాలు చెబుతున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top