నిమ్మగడ్డ ఇబ్బంది పెట్టినా.. భయపడలేదు : సజ్జల

Sajjala Ramakrishna Reddy Fires On TDP And Yellow Media - Sakshi

అందరు ఊహించినట్లే ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టంకట్టారని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తొలిదశ పంచాయతి ఎన్నికల్లో​ 2,637 వైఎస్సార్సీపీ మద్దతు దారులు విజయం సాధించారన్నారు. పచ్చ మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాస్తున్నా, ప్రజలు అధికారపార్టీ వైపే నిలిచారన్నారు. అందుకు 80 శాతానికి పైగా స్థానాలను వైఎస్సార్సీపీ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసిందన్నారు. ప్రతి పక్ష టీడీపీ పార్టీ వెంటిలెటర్‌పై ఉందని, రాజ్యంగ బద్ధ పదవిలో ఉండికూడా నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడని సజ్జల విమర్శించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎంత ఇబ్బందిపెట్టిన ఎవరు భయపడలేదన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ పథకాలు, కొవిడ్‌ లాంటి విపత్తును ఎదుర్కొవడంలో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు కల్పించిన భరోసానే ఎక్కువ స్థానాలు గెలవడానికి కారణమన్నారు.

కొన్ని పచ్చమీడియాలు బ్యానర్‌లో టీడీపీకి అనుకూలంగా రాసినప్పటికి, లోపల మాత్రం 80 శాతం వైఎస్సార్సీపీ , 20 శాతం టీడీపీ గెలిచాయని రాశాయన్నారు. వీరి తీరు మేకపోతు గాంభీర్యంలా ఉందన్నారు. దేవినేని ఉమా నియోజక వర్గంలో టీడీపీని ప్రజలునమ్మే స్థితిలో లేరన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ద్వారానే ప్రజలకు చేరువైందని అన్నారు. రానున్న40 రోజులు ఏంచేయాలో తమవద్ద ప్రణాళిక ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజ్యంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేయోద్దని టీడీపీకి హితవు పలికారు. వెన్నుపోటుకు పెటెంట్‌ ఉన్న బాబు, జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top