మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయింది: సజ్జల

Sajjala Ramakrishna Reddy Cabinet Reshuffle Raj Bhavan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయింది. రాత్రి 7 గంటలకు రాజ్‌భవన్‌కు మంత్రుల జాబితాను పంపుతాం' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్‌ తొలిసారి కేబినెట్‌ కూర్పులో 56 శాతం బలహీనవర్గాల వారే ఉన్నారు. ఈ సారి బలహీనవర్గాల శాతం మరింత పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top