రూ.50 లక్షలు ఇప్పిస్తా, రా­జీ చేసు­కుందామంటూ 'జ­నసేన' బెదిరింపు | Sai Krishna mother Vijayalakshmi fires on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షలు ఇప్పిస్తా, రా­జీ చేసు­కుందామంటూ 'జ­నసేన' బెదిరింపు

Jun 18 2026 5:04 AM | Updated on Jun 18 2026 5:53 AM

Sai Krishna mother Vijayalakshmi fires on Chandrababu Govt

సాయికృష్ణ (ఫైల్‌)

నా బిడ్డ బూడిదైనా ఇవ్వండి..! 

పోలీసులు అయినంత మాత్రాన చంపి తగలబెడతారా?

పిల్లోడిని చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు 

చంద్రబాబు సర్కార్‌పై సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆక్రోశం 

మాఫియా డాన్‌ కూలికి పని చేస్తాడా?: సాయికృష్ణ మేనమామ

జనసేన విజయవాడ తూర్పు ఇన్‌ఛార్జి రూ.50 లక్షలు ఇస్తామని వచ్చాడు: ముళ్లపూడి నవరంగ్‌  

నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇవ్వండి..! సీఐ నాగరాజు నా కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడు. ఫొటో చేయించి దండేసుకో అన్నాడు. చివరకు కనిపించకుండా చేశాడు. నా కుమారుడిని కొట్టి పోలీస్‌స్టేషన్‌ బాత్‌రూమ్‌లో పడేశారు. స్టేషన్‌లో చంపేసి, ఇద్దరు పోలీసులు బైక్‌పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు’ అంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది.

లబ్బీపేట/కృష్ణలంక (విజ­యవాడ తూర్పు): ‘నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇ­వ్వండి..!’ అంటూ విజయవాడ కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణ తల్లి గాదె వి­జయలక్ష్మి ఆక్రోశించా­రు. తమ బిడ్డ­ను తీసుకొచ్చి చంపేస్తే..రూ.50 లక్షలు ఇప్పిస్తా, రా­జీ చేసు­కుందామంటూ జ­నసేన తూర్పు ఇన్‌ఛార్జి అమ్మిశెట్టి వాసు బెదిరిస్తు­న్నా­రని కంటతడి పె­ట్టారు. ‘మేం జనసేనకు చెందిన వాళ్లమే.. అన్యా­యం జరిగితే ప్రశ్ని­స్తానన్న పవన్‌ ఈ విషయంలో స్పందించాలి..’ అని సాయికృష్ణ చిన మే­న­మామ ముళ్లపూడి నవరంగ్‌ కోరారు. బుధవారం విజయవాడలో వారు మీడియాతో మాట్లాడారు.  

పోలీసులైతే... చంపి తగలబెడతారా? 
సీఐ నాగరాజు తన కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడని, ఫొటో చేయించి దండేసుకో అన్నా­డని, చివరకు కనిపించకుండా చేశాడంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా బిడ్డకోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లా.. అక్కడ కుర్రాళ్లను కొడు­తుంటే తట్టుకోలేకపో­యా. నా కుమారుడిని చూపించమంటే చూపించలేదు. నా కుమారుడిని కొట్టి బాత్‌రూమ్‌లో పడేశారు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీస్‌ స్టేషన్‌లో చంపేసి.. ఇద్దరు పోలీసులు బైక్‌పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు. పిల్లోడిని చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సీఐకి ఎవడు ఇచ్చాడు అధికారం చంపేయమని? పోలీసులు అయినంత మాత్రాన చంపి తగలబెడతారా? నాకు మద్దతుగా నిలిచిన వారిపై నిందలు వేస్తున్నారు. నా కుమారుడికి రాజకీయాలు అంటగట్టొద్దు. న్యాయం చేయమని కోరుతున్నాం’ అని విజయలక్ష్మి విలపించారు.

మాఫియా, గంజాయి డాన్‌ అయితే రూ.350కి పని చేస్తాడా? 
పోలీసులు అన్ని కేసులు ఉన్నాయి.. ఇన్ని కేసులు ఉన్నాయని చెబుతున్నారు. మరి అలాంటి వాడిపై పీడీ యాక్ట్‌ ఎందుకు పెట్టలేదు? ఫోటోల్లో గొడ్డలి పెట్టి ట్రోల్‌ చేస్తున్నారు. కోర్టు వాయిదాకి వచ్చి కనిపిస్తే కొడతారని భయపడి మార్కాపురం వెళ్లి జొమాటోలో పనిచేస్తూ రోజుకు రూ.350 ఆదాయంతో బతికాడు. అంత పెద్ద మాఫియా డాన్, గంజాయి డాన్‌ అయితే రూ.350కి పని చేస్తాడా? గంజాయి ఫాల్స్‌ కేసులు పెట్టారు. ఆ కేసులు ఏవీ నిరూపణ కాలేదు. మా పిల్లోడిని మాకు అప్పగించాలి. చనిపోతే బాడీ అయినా ఇవ్వండి. పోలీసులు అంబేడ్కర్‌ విగ్రహం వద్దకి వచ్చి కేసులు ఉన్నాయని నిరూపించాలి. 
– ముళ్లపూడి నాగేశ్వరరావు, సాయికృష్ణ మేనమామ

రెండు కేసులే ఉన్నాయి: కనకదుర్గ, అడ్వొకేట్‌ 
సాయికృష్ణపై రెండు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ రెండు కేసుల్లో వాయిదాలకు హాజరు కాలేదని తీసుకొచ్చి కొట్టారు. బందర్‌ రోడ్డులో కూర్చుంటా. పోలీసులు వచ్చి ఎన్ని కేసులు ఉన్నాయో నిరూపించాలి. సాయికృష్ణకు రాజకీయాలతో సంబంధం లేదు.  

ప్రశ్నిస్తానన్న పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదు? 
ప్రశ్నిస్తా అని చెప్పే పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అనేక కేసుల్లో ఆందోళనలు చేశారు. మా అబ్బాయి విషయంలో ఏం చేస్తారు? మేమంతా జనసేనలో ఉంటూ పవన్‌ కళ్యాణ్, లోకేశ్‌ కోసం పని చేశాం. పవన్‌ కళ్యాణ్‌ స్పందించి న్యాయం చేయాలి. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చి చంపేస్తే డీజీపీ అడగరా..? కేసు సెటిల్‌ చేసుకుందామని, రూ.50 లక్షలు ఇప్పిస్తామని జనసేన నేత అమ్మిశెట్టి వాసు బెదిరించినా మేం ఒప్పుకోలేదు. మేం పోలీసులకు వ్యతిరేకం కాదు.. నాగరాజు చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నాం. ఈ కేసుతో సంబంధం ఉన్న సీఐతో పాటు అశోక్, బాబూరావు, సుబ్రహ్మణ్యం, మురళీకృష్ణ, మరికొంతమంది స్టేషన్‌లో ఉన్న వాళ్లను సస్పెండ్‌ చేయాలి. 

కేసులు ఉన్నాయని ఇష్టారాజ్యంగా తీసుకొచ్చి కొట్టి చంపేస్తారా? మావాడు రౌడీ అంటున్నారు. మీరు చేసిందేమిటి? మీరు హంతకులు కాదా? సామాన్యులకు న్యాయం జరగదా? అన్యాయం జరిగిందని మాకు అండగా నిలుస్తున్న వారికి పారీ్టలను అంటగడతారా? మాకు పారీ్టలు లేవు.. కులం లేదు. మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. మాకు న్యాయం చేయండి. విజయవాడలో వందల మంది రౌడీ షీటర్‌లు ఉన్నారు. కానీ మావాడినే తీసుకొచ్చి చంపేశారు. మేం రాజకీయాలు చేసే వాళ్లం కాదు. ఇప్పటికైనా పవన్‌ కళ్యాణ్, లోకేష్, హోం మంత్రి అనిత స్పందించాలి. మేం పనిచేసిన పార్టీ వాళ్లు మా కోసం ఏమీ చేయలేదు. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాకు అండగా నిలుస్తూ, న్యాయం కోసం పోరాడుతున్నారు. 
– ముళ్లపూడి నవరంగ్, సాయికృష్ణ మేనమామ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement