దంపతులను కాపాడిన సెల్ఫీ వీడియో | Relief for Indians Cheated by Agents After Going to Malaysia for Jobs | Sakshi
Sakshi News home page

దంపతులను కాపాడిన సెల్ఫీ వీడియో

Sep 21 2026 5:03 AM | Updated on Sep 21 2026 5:03 AM

Relief for Indians Cheated by Agents After Going to Malaysia for Jobs

కుటుంబ సభ్యులతో మలేషియా వెళ్లిన దంపతులు

ఉపాధి కోసం మలేషియా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి విముక్తి

పెదగంట్యాడ(విశాఖ): ఉపాధి కోసం మలేషి­యా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయి ఆత్మహత్యకుసైతం సిద్ధపడిన దంపతులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. వారు సురక్షితంగా భారత్‌ చేరుకున్నారు. రాజమహేంద్రవరంలోని నారాయణపురానికి చెందిన వెంకట రమణ, పూజిత దంపతులకు ఆరు నెలలు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. చిన్న కుమార్తె అనారోగ్యానికి చికిత్స చేయించేందుకు, అందుకుగాను చేసిన అప్పుల నుంచి గట్టెక్కేందుకు ఉపాధి కోసం ప్రయత్నించారు. 

ఇందులో భాగంగా పెదగంట్యాడ మండలం సమతానగర్‌లోని శ్రీరామచంద్ర టెస్టింగ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రామచంద్ర, నిర్మల అనే ఏజెంట్లను సంప్రదించారు. ఆ ఇద్దరు ఏజెంట్లు వీరి నుంచి రూ.4.50 లక్షలు తీసుకుని భారీ జీతాలు ఇప్పిస్తామంటూ గత మే 10న చెన్నై నుంచి మలేషియాలోని ఓ క్లీనింగ్‌ కంపెనీలో నిర్వహణ పనుల కోసం పంపించారు. పిల్లలను ఇక్కడే వదిలి వెళ్లిన దంపతులను అక్కడ ఏజెంట్లు జీతం ఇవ్వకుండా నరకయాతనకు గురిచేశారు. పాస్‌పోర్టులు లాక్కొన్నారు. ‘బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది.

మా పిల్లల భవిష్యత్తు గుర్తొచ్చి ఆగిపోయాం’ అంటూ వారు పేర్కొన్న సెల్ఫీ వీడియో వైరల్‌ కావడంతో నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి స్పందించారు. సీపీ ఆదేశాల మేరకు బాధిత దంపతులను విశాఖ తీసుకురావడానికి న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు తగిన చర్యలు తీసుకున్నారు. వారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement