శ్రీలంకలో జరగనున్న టోర్నీకి ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ భారత్ –ఎ జట్టులో స్థానం సంపాదించినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీ మెన్ కమిటీ సభ్యుడు టీవీ శివరామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి శ్రీలంకలో జరగనున్న టోరీ్నలో భారత్– ఏ జట్టు తరఫున రషీద్ ఆడనున్నారన్నారు.
గతంలో రషీద్ భారత అండర్– 19 వరల్డ్ కప్ పోటీల్లో వైస్ కెపె్టన్‌గా వ్యవహరించడమే కాకుండా, వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. గతేడాది రంజీ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రతిభ కనబరచడం ద్వారా భారత్ –ఎ జట్టులో స్థానం సంపాదించాడు. రషీద్‌కు త్రీమెన్ కమిటీ సభ్యులు జీవీ శరత్‌బాబు, టీవీ శివరామకృష్ణ, సీహెచ్ నాగరాజు తదితరులు అభినందనలు తెలిపారు.


