ఐఐఎం వైజాగ్‌కు అరుదైన అవార్డు  | rare award for IIM Vizag | Sakshi
Sakshi News home page

ఐఐఎం వైజాగ్‌కు అరుదైన అవార్డు 

Nov 27 2023 4:39 AM | Updated on Nov 27 2023 2:56 PM

rare award for IIM Vizag - Sakshi

అవార్డు అందుకుంటున్న ఐఐఎంవీ ప్రతినిధి సుబ్రహ్మణ్యం

సాక్షి, విశాఖపట్నం: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం (ఐఐఎంవీ) మరో అరుదైన అవార్డు దక్కించుకుంది. న్యూఢిల్లీలోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఫెస్టివల్‌–2023లో ఐఐఎంవీకు అవార్డు ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తూ స్టార్టప్‌లకు చేయూతనందిస్తున్నందుకు గాను పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అందించిన ప్రతిష్ఠాత్మక అవార్డును ఐఐఎంవీ ప్రతినిధి ఎంఎస్‌ సుబ్రహ్మణ్యం అందుకున్నారు.

ఐఐఎంవీలో మహిళా స్టార్టప్స్‌ని ప్రోత్సహించేందుకు ఐఐఎంవీ ఫీల్డ్‌(ఇంక్యుబేషన్‌ అండ్‌ స్టార్టప్స్‌)ను ఏర్పాటు చేశారు. ఇందులో మొదటి బ్యాచ్‌లో  20 మంది మహిళా పారిశ్రామికవేత్తలు సాగించిన విజయాలకు సంబంధించిన వివరాలతో ‘బ్రేకింగ్‌ బౌండరీస్‌’ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకం ప్రీమియర్‌ బిజినెస్‌ స్కూల్‌ అవార్డును సొంతం చేసుకుంది. అవార్డు సాధించడంపై ఐఐఎంవీ డైరెక్టర్‌ ప్రొ.ఎం చంద్రశేఖర్‌ అభినందనలు తెలిపారు. ఐఐఎంవీ ఫీల్డ్‌లో 90 మందికిపైగా మహిళా పారిశ్రామికవేత్తలు తమ స్టార్టప్స్‌ను అభివృద్ధి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement