పందికొక్కులు మీరు, మీ బాబే  | Sakshi
Sakshi News home page

పందికొక్కులు మీరు, మీ బాబే 

Published Wed, Apr 17 2024 6:04 AM

Ramoji false writings hiding the truth - Sakshi

రేషన్‌ బియ్యాన్ని మెక్కింది చంద్రబాబు కాదా రామోజీ?   

హెరిటేజ్‌కు ప్రజాధనాన్ని దోచిపెట్టినా తెలియలేదా? 

నాణ్యమైన సార్టెక్స్‌ రేషన్‌ జగన్‌ సర్కారులోనే అమలు  

ఐదేళ్లలో టీడీపీ సబ్సిడీ కింద ఇచ్చింది రూ.15,356 కోట్లు 

జగన్‌ ప్రభుత్వంలో రూ.28,491 కోట్ల వ్యయం 

2014–16 వరకు కందిపప్పు పంపిణీ ఊసే లేదు 

నిజాలను దాచి రామోజీ దగా రాతలు  

సాక్షి, అమరావతి: పెరిగిన కార్డులను ఒప్పుకోరు. అత్యంత నాణ్యతతో ఇస్తున్న సరుకులను చూడరు. దాదాపుగా రెట్టింపైన సబ్సిడీ గానీ...  ఇంటి ముంగిటకే వస్తున్న రేషన్‌ డెలివరీ గానీ... ఇవేవీ ‘నంగనాచి రామోజీ’కి పట్టవు!  ఐదేళ్ల జగన్‌ ప్రభుత్వం 162.15 లక్షల టన్నుల బియ్యం, 3.28 లక్షల టన్నుల చక్కెర, 3.28 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.28,491 కోట్లు ఖర్చు చేసినా సరే...రామోజీకి మాత్రం రేషన్‌ వ్యవస్థ గాడితప్పినట్టు కనిపిస్తోంది.

చంద్రబాబు హ యాంలో కేవలం 117.45 లక్షల టన్నుల బియ్యం, 3.15 లక్షల టన్నుల చక్కెర, 0.93 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.15,356 కోట్లు ఖర్చు చేస్తే అదేదో ఘనకార్యంగా ఈనాడు కీర్తిస్తోంది.  భాషా విచక్షణ కోల్పోయిన రామోజీ పరమ నీచపు రాతలు రాస్తున్నారు. ‘గాదె కింద పందికొక్కు.. కోతవేసే పప్పూ..ఉప్పు!’ అంటూ మంగళవారం ఈనాడులో రేషన్‌ పంపిణీపై దగాకోరుభాషను వాడారు.  

అప్పట్లో.. రేషన్‌ కోసం ఫీట్లు..అగచాట్లు... 
చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి 1.39 కోట్ల కార్డులు మిగిలాయి.  సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా నిర్దేశించి, పార్టీల కతీతంగా కార్డులు ఇవ్వడంతో  రాష్ట్రంలో 1.49 కోట్లకు కార్డుల సంఖ్య పెరిగింది. చంద్రబాబు హయాంలో  ముక్కిపోయిన, పురుగుల పట్టిన, రాళ్లు, నూకలు ఎక్కువగా ఉన్న బియ్యాన్ని ఇస్తే తినలేక జనం బియ్యం జోలికే పోయేవారు కాదు. జగన్‌ ప్రభుత్వంలో ఇప్పుడిస్తున్నది నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యం.

అప్పట్లో నాసిరకం బియ్యాన్నే లబ్ధిదారుల నుంచి  బాబు బినామీలు తమ దళారులతో పదీ పరక్కు కొనుగోలు చేసి అక్రమ రవాణా ద్వారా రూ.కోట్ల ప్రజాధనాన్ని మింగేసేవారు. వాస్తవానికి జాతీయ ఆహార భద్రత చట్టం కింద 2.68 కోట్ల మందికి 1.54 లక్షల టన్నులు మాత్రమే కేంద్రం బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే.. మిగిలిన 1.68 కోట్ల మంది లబి్ధదారులకు సీఎం జగన్‌ ప్రభుత్వం సొంత ఖర్చుతో 0.81 లక్షల టన్నుల బియ్యాన్ని అందిస్తోంది.  

హెరిటేజ్‌ కోసమే పండగ కానుకలు.. 
చంద్రబాబు ప్రభుత్వం పండగల పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను హెరిటేజ్‌కు దోచిపెట్టడానికి.. తమ అనుయాయులు స్వాహా చేయడానికే ఉపయోగించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. టెండర్లు లేకుండా ఇష్టమొచ్చిన ధరలకు అప్పటి ప్రభుత్వానికి సరుకులు సరఫరా చేసిన బాబు అనుయాయులు ప్రజాధనాన్ని మింగేశారు. దీనిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది.  2013లో అప్పటి ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే 9 రకాల నిత్యావసరాల్లో పామాయిల్‌ ఉండేది. బాబు ప్రభుత్వం దీన్ని తొలగించింది.  

కందిపప్పు పంపిణీ నాడు ఎన్నికల డ్రామా  
వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం జూన్‌ 2014 సెపె్టంబర్‌ నుంచి 2015 జూలై వరకు అసలు కందిపప్పు గురించి పట్టించుకోలేదు. నవంబర్‌ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేసింది. 2017–18లో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్చి 2018 నుంచి  రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఓపెన్‌ మార్కెట్‌లో హెచ్చురేటు ఎంత ఉన్నా, సబ్సిడీ భారాన్ని భరిస్తూ రూ.67కే అందిస్తోంది.  

ఇదీ.. బాబు చిరుధాన్యాల గుట్టు 
టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో రాగులు, జొన్నలు, గోధుమ పిండి, ఉప్పు పంపిణీ ప్రారంభించింది. 1.39 కోట్ల కార్డుల్లో కేవలం 1 శాతానికే వీటినిచి్చనా... అబ్బో అంటున్నారు రామోజీ. ఎన్నికల భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి సంవత్సరంలో టీడీపీ పంపిణీ చేసిందీ చిరు ధాన్యాల్ని. జగన్‌  ప్రభుత్వం కరోనా తర్వాత వినియోగదారులకు పౌష్టికాహారం పంపిణీలో భాగంగా ఉత్తరాంధ్రలో రాగులు, రాయలసీమలో రాగులు, జొన్నల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రేషన్‌లో కిలో బియ్యం బదులు కిలో రాగులు, జొన్నలు ఉచితంగా అందిస్తోంది.   

Advertisement
 
Advertisement