దంచికొట్టిన వర్షాలు | Rains are falling across the state | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వర్షాలు

Jun 12 2025 4:46 AM | Updated on Jun 12 2025 4:46 AM

Rains are falling across the state

ఏలూరు జిల్లా పెదపాలపర్రులో 15 సెంటీమీటర్ల వర్షం

కృష్ణా, ఏలూరు, బాపట్ల, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావం

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ­): ఈశాన్య రాజస్థాన్‌ నుంచి మధ్య­ప్రదేశ్, ఛత్తీ­స్‌గఢ్‌ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నుంచి బుధవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో 15.5 సెం.మీ. వర్షం కురి­సింది. కృష్ణా జిల్లా మచిలీ­పట్నంలో 10, గుడి­వాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటి­గడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. 

బుధవా­రం పా­ర్వ­­తీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయి­లో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పు­­గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్‌ కోన­సీమ జిల్లా తాత­పూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకు­లలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ద్రోణి ప్రభావంతో మరో రెండు, మూడు రోజుల­పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

గురువారం పార్వతీ­పురం మన్యం, అల్లూరి సీతారామ­రాజు, కర్నూలు, నంద్యా­ల, శ్రీసత్యసాయి, అన్న­మయ్య, చిత్తూరు, తిరు­పతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలిక­పాటి నుంచి మో­స్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడ­క్కడ తేలిక­పాటి వర్షాలు కురు­స్తాయని తెలిపింది. శుక్ర­వారం పార్వతీ­పురం మన్యం, అల్లూరి సీతా­రా­మ­రాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ­కాశం ఉందని వెల్లడించింది. 

శ్రీకాకుళం, విజ­యన­గరం, అనకాపల్లి, కాకినాడ, కోన­సీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement