ఎస్వీయూలో ర్యాగింగ్‌ కలకలం | Ragging stir at SV University | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో ర్యాగింగ్‌ కలకలం

Nov 15 2025 5:19 AM | Updated on Nov 15 2025 5:19 AM

Ragging stir at SV University

అర్ధరాత్రి ఇంజినీరింగ్‌ వసతి గృహాల్లో

జూనియర్లకు వేధింపులు

తిరుపతి సిటీ: ఎస్వీయూలో మళ్లీ ర్యాగింగ్‌ క­­కలం సృష్టించింది. 15రోజుల ముందు వర్సిటీలోని సైకాలజీ విభాగంలో ర్యాగింగ్‌కు గురై నలుగురు విద్యార్థినులు టీసీ­లు తీసుకుని వెళ్లిపోగా ఇప్పు­డు మరో ఘటన జరిగింది. వర్సిటీలో పైశాచికానందంతో సీనియర్లు ర్యాగింగ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. వర్సిటీలో ఇంజినీరింగ్‌ కళాశా­లకు చెందిన బాలుర వసతి గృహం విశ్వతేజ బ్లాక్‌ హాస్టల్‌లో గురువారం అర్ధరాత్రి జూనియర్లకు ఇంటరాక్షన్‌ క్లాసుల పేరు­తో సీనియర్లు ర్యాగింగ్‌ చేశారు.

అర్ధరాత్రి హాస్టల్‌లో జూనియర్లను గంటల తరబడి నిల్చోబెట్టి వికృత చేష్టలకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు వ­ర్సిటీకి చేరుకుని విషయంపై ఆరాతీయగా ఇంటరాక్షన్‌ క్లాసులు మాత్రమేనంటూ సీనియర్లు, హాస్టల్‌ సిబ్బంది మాయ మాటలు చెప్పసాగారు. దీంతో శుక్రవారం విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement