
టీడీపీ నేత శ్రీనివాసరావు ఇంటి ముందు బారులు తీరిన రైతులు. కంటెయినర్ ద్వారా ఎరువులు అందిస్తున్న దృశ్యం
రైతులు క్యూ కట్టడం చూసి ఇదేదో ఎరువుల దుకాణం అనుకునేరు... కాదు.. సాక్షాత్తూ టీడీపీ నేత ఇల్లు. విషయమేమంటే... శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయాల్సిన ఎరువులను తన వారికి ఇచ్చేందుకు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నాయకుడు ఎం. శ్రీనివాసరావు ఇంట్లో పెట్టుకుని, తనకు అనుకూలంగా ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చి మరీ పంపిణీ చేశారు.
వాటిపై ఆ శ్రీనివాసరావు సంతకం కూడా ఉంది. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది. పార్టీ పరంగా ఇంటికి పిలిపించుకుని అనుకూలమైన వారికి టోకెన్లు ఇవ్వడమేంటని కొందరు టీడీపీ నేతలను నిలదీశారు. ఈ విషయమై వ్యవసాయాధికారి నవీన్‌ను సంప్రదించగా కల్లేపల్లికి 333 బస్తాల ఎరువులు పంపామని, తమ సిబ్బంది సమక్షంలోనే అందించామంటూ బుకాయించారు. – శ్రీకాకుళం రూరల్