ఏపీలో కోవిడ్‌ కేర్‌ సెంటర్లపై కొరడా | Private Covid Centres Permits Cancelled In AP Claiming High Charges | Sakshi
Sakshi News home page

ఏపీలో కోవిడ్‌ కేర్‌ సెంటర్లపై కొరడా

Aug 26 2020 12:26 PM | Updated on Aug 26 2020 2:54 PM

Private Covid Centres Permits Cancelled In AP Claiming High Charges - Sakshi

నిబంధనల ఉల్లంఘన, అధిక ఫీజులు వసూలు చేసిన రమేష్ ఆస్పత్రికి చెందిన హోటల్ స్వర్ణ హైట్స్ అనుమతులను అధికారులు రద్దు చేశారు. దీంతోపాటు ఎనికేపాడులోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న హోటల్ అక్షయ

సాక్షి, విజయవాడ: అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లపై అధికారులు కొరడా ఝళిపించారు. విజయవాడలోని ఐదు ప్రైవేట్  కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులను ఆరోగ్య విభాగం అధికారులు బుధవారం రద్దు చేశారు. నిబంధనల ఉల్లంఘన, అధిక ఫీజులు వసూలు చేసిన రమేష్ ఆస్పత్రికి చెందిన హోటల్ స్వర్ణ హైట్స్ అనుమతులను అధికారులు రద్దు చేశారు. దీంతోపాటు ఎనికేపాడులోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న హోటల్ అక్షయ, ఇండో బ్రిటిష్ హాస్పిటల్‌కు చెందిన ఐరా హోటల్, ఆంధ్రా హాస్పిటల్స్ కు చెందిన హోటల్ మర్గ్ కృష్ణయ్య , హోటల్ సన్‌ సిటీ అనుమతులను అధికారులు రద్దు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నవారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
(చదవండి: తప్పంతా రమేష్‌ ఆస్పత్రిదే)

Advertisement
 
Advertisement
Advertisement