మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం

Politicians Expresses Grief Over Death Of Minister Gowtahm Reddy - Sakshi

సాక్షి, అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఓ మంచి స్నేహితుడ్ని, అన్నను కోల్పోయా: మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. ఓ మంచి స్నేహితుడు, అన్నను కోల్పోయానన్నారు. 

  • మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి  దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు
  • ఏపీ ఐటి రంగంలో అభివృద్ధి చేసిన మేకపాటి గౌతంరెడ్డి మరణం బాధాకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.. అభివృద్ధి చెందుతున్న ఏపీకి తీరని లోటు అవంతి పేర్కొన్నారు. సహచర మంత్రిగా స్నేహితునిగా ఆయన మరణం ఊహించుకోలేక  పోతున్నామన్నారు.
  • రాష్ట్ర ఐ.టి.శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నూజివీడు ఎమ్మెల్యే మేకాప్రతాప్ ప్రతాప్ అప్పారావు.
  • మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ. ఆయన అకాలమరణం పార్టీకి తీరని లోటు. ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయాం.
  • మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మంత్రి పేర్నినాని.
  • మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పరిశ్రమలు, ఐటీ మంత్రిగా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నిన్నటి వరకు కూడా రాష్ర్టంలో పెట్టుబడుల కోసం దుబాయ్‌లో పర్యటించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇక లేరు అనే వార్త కలచి వేసిందన్నారు.

చాలా బాధాకరం: తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణ వార్త కలచివేసిందని మంత్రి తానేటి వనిత అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పార్థిస్తున్నాన్నారు.

గౌతమ్‌రెడ్డి మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి కోసం గౌతమ్‌రెడ్డి నిరంతరం శ్రమించారన్నారు.

గౌతమ్‌రెడ్డి మృతి పట్ల మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యుడిలా గౌతమ్‌రెడ్డి ఉండేవారన్నారు. గౌతమ్‌రెడ్డి మరణం పార్టీ, ప్రజలకు తీరని లోటన్నారు.

మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భాంతి వ్యక్తం చేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top