కోడి పందేల స్థావరంపై దాడి.. 14 మందిని అరెస్ట్ |Police Raid On Chicken Racing Base In Telangana Mulugu, More Details Inside | Sakshi
Sakshi News home page

కోడి పందేల స్థావరంపై దాడి.. 14 మందిని అరెస్ట్

Jul 16 2024 12:22 PM | Updated on Jul 16 2024 1:42 PM

Police Raid On Chicken Racing Base

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
దాడిలో 14 మందిని అరెస్ట్

వాజేడు: లక్షీపురం, గెర్రగూడెం గ్రామాల శివారులోని ఊర చెరువు వద్ద కోడి పందేల స్థావరంపై వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు.

పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా కొంతమంది కోడి పందేలు ఆడుతూ పోలీసులను చూసి పారిపోయారు. పారి పోతున్న వారిని వెంబడించి పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.

ఈ దాడిలో 14 మందిని అదుపులోకి తీసుకోగా.. వారి నుంచి 5 కోడి పుంజులు, 4 కోడి కత్తులు, రూ.28,900 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరీశ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement