సాక్షి, పల్నాడు: వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. ఆయన ఇంటికి పోలీసులు భారీగా చేరుకొని వినుకొండ నుంచి నరసరావుపేట వెళ్లిపోవాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసులు వ్యవహారంపై తీవ్ర అసహానం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తన ఇంట్లో తాను ఉంటానని ఉంటే ఎలా వెళ్లిపొమ్మంటారని పోలీసులను మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండలో ఉండనివ్వకుండా బలవంతంగా భారీ ఎస్కార్ట్ తో నరసరావుపేటకు పోలీసులు తీసుకెళ్లారు. అయితే పచ్చపార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండలోనే ఉన్నా పోలీసులు ఆయనపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఇదీ చదవండి: అంధకారంలో పోలింగ్ స్టేషన్లు


