Photo Feature: దర్జీ సంతసం

Photo Feature Mobile Tailor Shops Vizag Agency - Sakshi

రడీమేడ్‌ దుస్తులు వచ్చిన తర్వాత చాలా మంది దర్జీలకు ఉపాధి కరువైంది. దీంతో వారంతా ఇతర వృత్తుల వైపు వెళ్లకుండా.. ఆదాయం పొందే మార్గాలను అన్వేషించారు. కొందరు సంచార దర్జీలుగా మారారు. అందులో భాగంగానే వారపు సంతల్లో కుట్టుమిషన్లు పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పాడేరు, చింతపల్లి, అరకులోయ యూత్‌ శిక్షణ కేంద్రాల ద్వారా వందలాది మంది గిరిజన మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించారు.

2006 నుంచి 2009 వరకు శిక్షణ పొందిన గిరిజన మహిళలందరికీ ప్రభుత్వమే ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. ప్రస్తుతం ఏజెన్సీలోని వారపు సంతలతో పాటు గిరిజన గ్రామాల్లో ఈ మహిళలంతా కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు.  సిమిలిగుడకు చెందిన పాంగి మిధుల అనే మహిళ అరకులోయ మండలం మారుమూల లోతేరు వారపు సంతలో దుస్తులు కుడుతున్న చిత్రం ఇక్కడ చూడొచ్చు.                
–సాక్షి, పాడేరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top