ఈర్ష్య, కడుపు మంటతో బాబు రగిలిపోతున్నారు: మంత్రి పేర్ని నాని ధ్వజం

Perni Nani Slams Chandrababu Naidu Over Controversial Comments On AP CM Ys Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈర్ష్య, కడుపుమంటతో రగిలిపోతూ ఇష్టానుసారం మాట్లాడు తున్నారని సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మండిప డ్డారు. తన కుమారుడి వయసు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గాలిలో కలిసిపోతాడంటూ మాట్లాడటం దారుణమన్నారు. మంత్రి నాని శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహ రించాల్సిన చంద్రబాబు శృతిమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా ఆయన భార్యను అవమానించామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

వరద ప్రభా విత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను చూసి చంద్రబాబుకు మతిపోయిందన్నారు. బాధితులను ఓదార్చడం మానేసి తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో వరదలు వచ్చినప్పుడు చంద్ర బాబు నదిలో ఈదుకుంటూ వెళ్లారా అని నిలదీశారు. మోకాలి లోతు కూడా లేని నీళ్లలో పడవపై లైఫ్‌ జాకెట్‌ వేసుకుని చంద్రబాబు చేసిన డ్రామాలను చూసి ప్రజ లు నవ్వుకుంటున్నారన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు హెలికాప్టర్‌లో కూర్చుకుని గిన్నెలు గిన్నెలు టిఫిన్లు తింటూ ఏరియల్‌ సర్వే చేశారని ఎద్దేవా చేశారు. తమ ముఖ్యమంత్రి ప్రచారం కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారని స్పష్టం చేశారు.

ఇకనైనా టీడీపీకి పుట్టగతులు కూడా లేకుండా చేయొద్దని ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు హితవు చెప్పాలన్నారు. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 31 మంది మరణానికి కారణమై మానవ తప్పిదం చేశారని మండిపడ్డారు. ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల విషయంలో జీవో నంబర్‌ 35లో నిర్దేశించిన ధరలను పునఃసమీక్షించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, పలువురు నటులు, ప్రొడ్యూసర్లు ప్రభుత్వాన్ని కోరారన్నారు. త్వరలోనే ఈ విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top