ఒకటో తేదీనే 52.70 లక్షల మందికి రూ.1,451.41 కోట్ల పింఛన్‌ | Pension will be distributed across the state on September 1 | Sakshi
Sakshi News home page

ఒకటో తేదీనే 52.70 లక్షల మందికి రూ.1,451.41 కోట్ల పింఛన్‌

Sep 2 2023 4:07 AM | Updated on Sep 2 2023 4:07 AM

Pension will be distributed across the state on September 1 - Sakshi

సాక్షి, అమరావతి: ఠంఛన్‌గా సెప్టెంబర్‌ ఒకటో తేదీనే రాష్ట్రవ్యాప్తంగా 52,70,915 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు రూ.1,451.41 కోట్ల పింఛన్‌ డబ్బులు అందాయి. ఈ నెల 1 నుంచి మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం గురువారమే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.

ఇందులో 1,49,875 మందికి ఈ నెలలోనే ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్టు సెర్ప్‌ అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు... లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మొత్తం పింఛన్‌దారుల్లో 82.30 శాతం మందికి తొలిరోజే డబ్బులు పంపిణీ చేశారని చెప్పారు.   

Advertisement
 
Advertisement
Advertisement