ఇది ఇంటర్వెల్‌ మాత్రమే.. శుభం కార్డు వేరేగా ఉంటుంది  | Peddi Reddy Comments On Withdrawal Of Capital Decentralization Bill | Sakshi
Sakshi News home page

 రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి  

Nov 23 2021 4:40 AM | Updated on Nov 23 2021 8:03 AM

Peddi Reddy Comments On Withdrawal Of Capital Decentralization Bill - Sakshi

తిరుపతి రూరల్‌: బిల్లులో టెక్నికల్‌ సమస్యల వల్లే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఇది ఇంటర్వెల్‌ మాత్రమేనని, సినిమా శుభంకార్డు ముగింపు వేరేగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయన సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. న్యాయపరమైన చిక్కుల వల్లే వెనక్కి తగ్గామని, సమస్యలను సరిదిద్ది మూడుప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా మెరుగైన బిల్లుతో వస్తామని చెప్పారు. వ్యక్తిగతంగా తాను మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. పాదయాత్ర చేస్తోంది టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులు మాత్రమేనని, ఆ పాదయాత్రను చూసి చట్టం ఉపసంహరించలేదని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement