చేతులు కలిపిన హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌, జపాన్‌ బ్యాంకు | hdfc capital development bank of japan 1 billion affordable housing fund india | Sakshi
Sakshi News home page

చేతులు కలిపిన హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌, జపాన్‌ బ్యాంకు

May 31 2026 7:31 AM | Updated on May 31 2026 7:34 AM

hdfc capital development bank of japan 1 billion affordable housing fund india

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మధ్యాదాయ, అందుబాటు ధరల గృహ సముదాయ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్‌ చేసేందుకు తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌తో డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(డీబీజే) చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా రియల్టీ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నాయి. మొత్తం బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 9,500 కోట్లు) మూలధన లక్ష్యంతో ఫండ్‌కు తెరతీయనున్నాయి.

దీంతో డీబీజే తొలిసారి దేశీయంగా రియల్టీ రంగంలో పెట్టుబడులు చేపట్టనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ పేర్కొంది. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు. హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ డెవలప్‌మెంట్‌ రియల్టీ చౌక, మధ్యాదాయ(హెచ్‌–డీఆర్‌ఈఏఎం(డ్రీమ్‌) ఫండ్‌ పేరుతో ఏర్పాటు చేయనున్న నిధిని హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ అడ్వయిజర్స్‌ నిర్వహించనున్నట్లు తెలియజేసింది.

50 కోట్ల డాలర్ల కార్పస్‌ లక్ష్యానికి మరో 50 కోట్ల డాలర్లు గ్రీన్‌షూ ఆప్షన్‌తో ఫండ్‌ను నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. 35 కోట్ల డాలర్లమేర పెట్టుబడులకు ప్రస్తుత ఇన్వెస్టర్లు కట్టుబాటు చూపనున్నట్లు వివరించింది. హెచ్‌డ్రీమ్‌ ఫండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌లో యాంకర్‌ ఇన్వెస్టర్‌గా ఐఎఫ్‌సీ 15 కోట్ల డాలర్ల పెట్టుబడులకు గతేడాది ఆగస్ట్‌లో కట్టుబాటును ప్రదర్శించినట్లు ప్రస్తావించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement