ఇక బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు! | Now there are four nominees for the bank account | Sakshi
Sakshi News home page

ఇక బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు!

Apr 26 2025 4:28 AM | Updated on Apr 26 2025 4:28 AM

Now there are four nominees for the bank account

మ్యూచువల్‌ ఫండ్స్, డీమ్యాట్, బీమా ఖాతాలకు ముగ్గురు నామినీలు

ఒకరి తర్వాత ఒకరిని హక్కుదారులుగా సూచించవచ్చు 

ఖాతాలోని ఆస్తిని శాతాల వారీగా కేటాయించవచ్చు  

బ్యాంకింగ్‌ చట్టాల బిల్లు సవరణతో అవకాశం

సాక్షి, అమరావతి: బ్యాంకు ఖాతాదారులు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం రానుంది. ఆరి్థక ఆస్తుల నిర్వహణలో పారదర్శత తీసుకురావడంతోపాటు బ్యాంకింగ్‌ వ్యవస్థలో క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడం కోసం కేంద్రం ఈ మార్పు తీసుకొస్తోంది. ఇందుకోసం ఇటీవలే బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నాలుగు రోజుల క్రితమే ఈ సవరణపై నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్, డీమ్యాట్, బీమా నామినేషన్‌ నియమాలలో త్వరలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.  

ఖాతా దారులకు రెండు ఆప్షన్లు
నలుగురు నామినీల్లో ఎవరిని హక్కుదారుగా నిర్ణయించాలనేది బ్యాంకు ఖాతాదారు ఇష్టం. దీనికోసం రెండు ఆప్షన్లను కేంద్రం ప్రతిపాదించింది. మొదటి ఆప్షన్‌లో ఓ ఖాతాదారుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అందరినీ నామినీలుగా పెట్టుకుని ఒకరి మరణా­నంతరం మరొకరిని హక్కుదారుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు తొలుత భార్య ఆమె మరణానంతరం కుమారుడు, అతని మరణానంతరం కుమార్తెలను హక్కుదారులుగా సూచించవచ్చు. 

రెండో ఆప్షన్‌లో తన ఖాతాలోని ఆస్తిని శాతాలవారీగా నలుగురికీ కేటాయించవచ్చు. ఈ మార్పు అన్ని ఖాతాలకు (మ్యూచువల్‌ ఫండ్స్, డీమ్యాట్, బీమా, బ్యాంక్‌) వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాకు మాత్రమే నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్, డీమ్యాట్, బీమా వంటి వాటికి ముగ్గురు నామినీలను నియమించే అవకాశం మాత్రమే ఉంది.

గతంలో ఒక్క నామినీకే అవకాశం  
గతంలో బ్యాంక్‌ ఖాతాకు ఒక్క నామినీని మాత్రమే పేర్కొనే అవకాశం ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలాకాలం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. నామినీ మరణించినా అతని ఖాతాలోని ఆస్తులు వారసులకు బదిలీ కాకపోవడంతోపాటు రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి పదేళ్ల తర్వాత ఖాతాలోని ఆస్తులు ఎవరికీ క్లెయిమ్‌ చేయకపోవడం వల్ల డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎవేర్‌నెస్‌ ఫండ్‌కి అవి జమ అయిపోతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement