No Plan To Go To Unstoppable Show Of Balakrishna Minister RK Roja - Sakshi
Sakshi News home page

‘బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోకి వెళ్లే యోచన లేదు’

Jan 16 2023 7:50 PM | Updated on Jan 16 2023 9:23 PM

No Plan To Go To Unstoppable show Of Balakrishna Minister RK Roja - Sakshi

విజయవాడ: బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోకి వెళ్లే ప్రసక్తే లేదని మంత్రి ఆర్‌కే రోజా తేల్చిచెప్పారు. గతంలో రెండుసార్లు పిలిచినప్పుడు వెళ్లడం కుదరలేదని.. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌లో తర్వాత అన్‌స్టాపబుల్‌ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని మంత్రి రోజా పేర్కొన్నారు. లోకేష్‌ పాదయాత్ర చేసినా, పవన్‌ వారాహి అంటూ వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధిస్తామని రోజా ధీమా వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంచితే, విజయవాడ భవానీ ద్వీపంలో సంక్రాంతి ముగింపు వేడుకల్లో రోజా పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. భవానీ ద్వీపంలో సంక్రాంతి సంబరాలు బాగా జరిగాయి. ఏపీ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాం.  టెంపుల్‌ టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాం. నదీతీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. పబ్లిక్‌-ప్రైవేటు విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం’ అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement