విశాఖ–ఖరగ్‌పూర్‌ మధ్య హైవే | NHAI tenders for DPR: Visakhapatnam to Kharagpur highway in Andhra pradesh | Sakshi
Sakshi News home page

విశాఖ–ఖరగ్‌పూర్‌ మధ్య హైవే

Nov 26 2024 4:52 AM | Updated on Nov 26 2024 4:52 AM

 NHAI tenders for DPR: Visakhapatnam to Kharagpur highway in Andhra pradesh

783 కి.మీ. మేర గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

డీపీఆర్‌ కోసం ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు

ఏడాదిన్నరలో నిర్మాణం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్‌ (పశ్చిమ బెంగాల్‌) మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించనుంది. 

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రధాన అంశాలివీ
⇒ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవా­ణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్‌ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. 
⇒  విశాఖపట్నం– ఖరగ్‌పూర్‌ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.
⇒ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.

⇒ వి­శాఖపట్నం, భావనపాడు, గోపాల్‌పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.
⇒ విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్‌ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్‌ నుంచి ఖరగ్‌పూర్‌ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్‌ చేపడతారు.

⇒ డీపీఆర్‌ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్‌ చివరి వారానికి ఎన్‌హెచ్‌ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. 
⇒ 2025 జూన్‌ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.
⇒ ఏడాదిన్నరలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement