మహిళతో డాక్టర్‌ వివాహేతర సంబంధం.. రోడ్డు మీదే రచ్చరచ్చ!

Nellore Doctor Extramarital Affair Street Fight Video Viral - Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఓ వివాహేతర సంబంధం రచ్చకెక్కింది.. నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావుకు తన దగ్గర పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లపాటు ఈ ఎఫైర్‌ కొనసాగింది. అయితే ఇటీవల మహిళను డాక్టర్‌  బాలకోటేశ్వరరావు దూరం పెడుతున్నాడు. దీంతో సదరు మహిళ.. తన ఎందుకు రావడం లేదని అతని ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించింది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. డాక్టర్‌, మహిళ మధ్య మాటామాటా పెరిగి ఇరువురు పరస్పర దాడులకు దిగారు. కోపంతో చెలరేగిన మహిళ కోటేశ్వరరావును చొక్కాపట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చింది. అందరూ చూస్తుండగానే రోడ్డుపై పరస్పరం కొట్టుకున్నారు.  అనంతరం సదరు మహిళ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డుపై ఇద్దరూ కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా!
చేపలు, రొయ్యలు, పీతలు.. ఇక మన దరికే ‘మీనం’!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top