మేడ పైనుంచి జారిపడి నేవల్‌ కమాండర్‌ మృతి | Naval Commander Deceased Over Falling From A Building | Sakshi
Sakshi News home page

మేడ పైనుంచి జారిపడి నేవల్‌ కమాండర్‌ మృతి

Aug 24 2020 9:08 AM | Updated on Aug 24 2020 9:12 AM

Naval Commander Deceased Over Falling From A Building - Sakshi

సాక్షి, మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఐదు అంతస్తుల మేడ పైనుంచి జారిపడి ఓ నేవల్‌ కమాండర్‌ శనివారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎన్‌పీ దర్శిన్‌ (38) నేవల్‌ కమాండర్‌ హోదాలో పనిచేస్తున్నారు. సింథియా సమీపాన గల నేవల్‌ పార్కు క్వార్టర్స్‌లో ఉంటున్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శనివారం వర్షం కురుస్తుండటంతో తాను ఉంటున్న భవనం ఐదో అంతస్తు నుంచి బాల్కనీ వద్దకొచ్చి చేతిని బయటకు చాచారు. దీంతో ఒక్కసారిగా జారి కిందికి పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే దర్శిన్‌ మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. సీఐ దుర్గాప్రసాద్‌ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement