Nallapareddy Prasanna Kumar Reddy Fires on CBN Atchannaidu - Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్‌ హయాంలో రామోజీతో ఇలాంటి ప్రచారమే!’.. ప్రసన్నకుమార్‌రెడ్డి ఫైర్‌

Mar 29 2023 10:14 AM | Updated on Mar 29 2023 10:47 AM

Nallapareddy Prasanna Kumar Reddy Fires on CBN Atchannaidu - Sakshi

మునిగిపోతున్న టీడీపీకీ జీవం పోసుకునేందుకే ఇలాంటి అసత్య ప్రచారాలకు.. 

సాక్షి, నెల్లూరు: యెల్లో మీడియాలో తనపై జరుగుతున్న అసత్యప్రచారంపై కోవూరు(నెల్లూరు) ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి మరోసారి స్పందించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ముఖ్యనేత అచ్చెన్నాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే లు అసంతృప్తిగా ఉన్నారంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. కానీ, ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీతో టచ్‌లో లేరు. మునిగిపోతున్న టీడీపీకీ జీవం పోసుకునేందుకే ఇలాంటి అసత్య ప్రచారాలకు దిగారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు, ఆంబోతు అచ్చెన్నాయుడు డైరెక్షన్‌లోనే గోబెల్స్‌ ప్రచారం జరుగుతోందని మండిపడ్డారాయన.

గతంలో ఎన్టీఆర్‌ హయాంలోనూ రామోజీరావును అడ్డంపెట్టుకుని ఇలాంటి ప్రచారాలు చంద్రబాబు చేయించాడని ప్రసన్నకుమార్‌ గుర్తు చేశారు. మంత్రి పదవి రాలేదని తాను అలిగినట్లు యెల్లో మీడియా ద్వారా అసత్య కథనాలు రాయిస్తున్నారని, రాసి పెట్టి ఉంటే పదవులు ఎక్కడికీ పోవని పేర్కొన్నారాయన. రాజకీయాల్లో వెనుకబడిన దళితులకు మంత్రి పదవులు ఇవ్వడం తప్పు అన్నచందాన చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. 

ఇదీ చదవండి: టీడీపీ మాజీలకు గెలుపు దూరం, అందుకే ఈ డ్రామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement