మందడంలో బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

MP Nandigam Suresh Angry On Satyakumar And Adinarayana Reddy - Sakshi

సాక్షి, అమరావతి: మందడంలో బీజేపీ నేతలు వీరంగం సృష్టించారు. దీక్ష శిబిరం వద్ద దళితులపై బీజేపీ నేత సత్యకుమార్‌ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సత్యకుమార్‌ అనుచరుల తీరుపై బహుజన పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యకుమార్‌ వాహనాన్ని అడ్డుకున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహుజన పరిరక్షణ సమితి ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సత్యకుమార్‌ అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆడవాళ్లని చూడకుండా టెంట్‌లో నుంచి లాక్కొచ్చారన్నారు. బీజేపీ ముసుగులో టీడీపీ నాయకులు వచ్చి వీరంగం సృష్టించారని, ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని వికేంద్రీకరణ మద్దతుదారులు డిమాండ్‌ చేశారు. ఇదంతా చంద్రబాబు వెనుకుండి నడిపిస్తున్నారని మండిపడ్డారు. 

మాజీ మంత్రి ఆదినారాయణ పిచ్చొడిలా మాట్లాడుతున్నారని ఎంపీ నందిగం సురేష్‌ మండిపడ్డారు. ‘‘సీఎంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు దీక్ష వద్దకు వచ్చి రెచ్చగొడుతున్నారు. సత్యకుమార్‌ అనుచరులు దళితులపై దాడి చేశారు’’  అని ఎంపీ సురేష్‌ నిప్పులు చెరిగారు.
చదవండి: ఊహలే వార్తలా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా?

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top