ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్‌ దిక్సూచి: ఎంపీ మార్గాని భరత్‌ | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్‌ దిక్సూచి: ఎంపీ మార్గాని భరత్‌

Published Tue, Feb 21 2023 3:34 PM

Mp Margani Bharat Praises Cm Ys Jagan Over Mlc Seat Allotment - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ తెలిపారు. చంద్రబాబు హయాంలో వెనుకబడిన వర్గాలకు 30 శాతం మాత్రమే అవకాశం ఇచ్చారని, అయితే పదవుల్లో బలహీనవర్గాలకు 68 శాతం అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.

బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, ఆయనది పెత్తందారీ వ్యవస్థ విధానమని ధ్వజమెత్తారు. బలహీనవర్గాలు ఎప్పుడూ వెనుకే ఉండాలనే కాన్సెప్ట్‌తో చంద్రబాబు వ్యవహరించేవాడని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్‌ దిక్సూచని, ఆయన గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదని మండిపడ్డారు.

చదవండి: కేడీ పోలీస్‌.. గుట్టుగా వ్యభిచారం! మహిళా ఎస్‌ఐ కుటుంబసభ్యులే అలా..!

Advertisement
 
Advertisement
 
Advertisement