‘చంద్రబాబు హయాంలో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారు’ | Minister Venugopala Krishna Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు హయాంలో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారు’

Nov 8 2022 2:44 PM | Updated on Nov 8 2022 4:54 PM

Minister Venugopala Krishna Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉన్నత చదువులు అందుతున్నాయని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్సార్‌ హయాంలో గీత వృత్తిదారులకు న్యాయం జరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో ఉన్నత చదువులు చదివారని గుర్తు చేశారు. గీత కార్మికులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎంతో ఉపయోగపడిందన్నారు.

గీత కార్మికుల జీవిత భద్రత కోసం ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని, వారు ప్రమాదవశాత్తూ చనిపోతే 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారన్నారు. చంద్రబాబు నిర్ణయంతో పేదలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. గీత ఉపకులాల వారికి సీఎం జగన్‌  భరోసా ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ వచ్చాక విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పు చేశారని మంత్రి అన్నారు. ఏపీలో గీత కార్మికులకు లభిస్తున్న లబ్ది మరే రాష్ట్రంలో లేదని, ముఖ్యమంత్రి ఇప్పటికే ఈబీసీల రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నారని వేణు అన్నారు.
చదవండి: హరిపురం ఘటనపై విస్తుపోయే వాస్తవాలు.. చక్రం తిప్పిన టీడీపీ నేత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement