అప్పుడు వద్దని ఇప్పుడు ఎందుకు?

MInister Venu Gopal Krishna Speaks About Local Elections - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజస్వరూపం అందరికి తెలిసిపోయిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘26 కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలను వాయిదా వేసి 26 వేల కేసులున్నప్పుడు పెడతామని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు కమిషన్ నిర్ణయం తీసుకోవడం సరికాదు అన్నారు. గతంలో వాయిదా వేసినప్పుడు ఎందుకు రాజకీయ పార్టీలతో చర్చించలేదు అని అన్నారు. అచ్చెన్నాయుడు పోలీస్‌లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.

స్థానిక ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. సోనియా గాంధీని ఢీకొని సింగిల్‌గా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిది అని అన్నారు. టీడీపీకి 50 నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లే లేరని, వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. ‘వాళ్ళకి మేం భయపడేది ఏంటి’ అని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి 16 నెలల పాలనతో టీడీపీకి ఓటేసేవాడే లేడని తేలిపోయిందన్నారు. చంద్రబాబు రాష్ట్రానికే రావట్లేదని, ఇక ఎన్నికల్లో వాళ్లెం చెయ్యగలరు అని అన్నారు. 

చదవండి: పేదల ద్రోహి చంద్రబాబు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top