
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రలన్నీ అధికారంలోకి రాకముందే ఊహించామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేయగలడో అందరికీ తెలుసు.. వాటన్నింటినీ అధిగమించి ముందుకెళ్తాం తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని’’ ట్విటర్ వేదికగా పేర్ని నాని స్పష్టం చేశారు. గతంలో చెప్పినట్టుగానే కచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ట్విటర్‌లో పేర్కొన్నారు. (వైఎస్ జగన్ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు)