నువ్వు గెలవలేవు.. నన్ను ఓడించలేవు

సాక్షి, చిత్తూరు: రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ముమ్మాటికీ గెలవలేరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పంలో గెలవగల, పుంగనూరులో తనను ఓడించగల సత్తా చంద్రబాబుకులేదన్నారు. తనను పుంగనూరు పుడంగి అంటున్నారని, ఆయనకు పుడంగి అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు.
పుడంగి అంటే బలవంతుడని, తాను ఆయనకంటే బలవంతుడునని ఒప్పుకున్నారని చెప్పారు. ఇక 1993 నుంచి తాము పాల వ్యాపారం చేస్తున్నామని.. మీలా భాగస్వాములను మోసగించి షేర్లను స్వాధీనం చేసుకోలేదన్నారు. మీ అనుకూల మీడియాని పిలిచి తక్కువ ధర ఎవరు ఇస్తున్నారో నిరూపించమని పెద్దిరెడ్డి సవాల్‌చేశారు.
చదవండి: (బాబు వ్యాఖ్యలు దారుణం)
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు