
సాక్షి, విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కోసం మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక జారీ చేశారు. థియేటర్ల బంద్‌పై మంత్రి దుర్గేష్ ఏకంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..‘సినిమా థియేటర్ల మూసివేతపై విచారణకు ఆదేశించాం. హోంశాఖ కార్యదర్శి చేత విచారణ చేపట్టాం. ఎందుకు సినిమా హాళ్లు బంద్ చేస్తున్నారో విచారించమన్నాం. ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారో విచారించమని చెప్పాం. జూన్ 12న పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంలో ఎందుకు థియేటర్లు మూసేస్తున్నారు. ఎవరితో చర్చించి థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చారు. అందుకే మేం విచారణకు ఆదేశించాం’ అని చెప్పుకొచ్చారు.
