రైతు కంట తడి పెట్టనివ్వను: మంత్రి కాకాణి

Minister Kakani Govardhan Reddy Receives Grand Welcome Muthukur Nellore District - Sakshi

ముత్తుకూరు(నెల్లూరు జిల్లా): వ్యవసాయశాఖ మంత్రిగా, రైతు బిడ్డగా రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కంట తడి పెట్టనివ్వకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాజకీయంగా జన్మనిచ్చి ఎదుగుదలకు ఆశీస్సులందించిన సర్వేపల్లి ప్రజానీకాన్ని కంఠంలో ప్రాణమున్నంత వరకు రుణపడి ఉంటానని కాకాణి అన్నారు.

చదవండి👉: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం

మంత్రి హోదాలో ఆదివారం సాయంత్రం తొలిసారిగా ముత్తుకూరుకు వచ్చిన కాకాణికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సభలో ఆయన ప్రసంగించారు. ఏ హోదాలో ఉన్నప్పటికీ నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.360 కోట్లతో సీసీరోడ్లు, సైడు డ్రెయిన్ల నిర్మాణం చేయించామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామన్నారు. ట్యాంకర్ల ద్వారా రవాణా చేసే దుస్థితి లేకుండా ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తున్నామన్నారు. ఇంటింటికీ కుళాయి పథకం అమలు చేస్తున్నామన్నారు.

80 రోజుల పాటు గ్రామాల్లో పర్యటన  
మే 10వ తేదీ తర్వాత ‘సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కాంపైన్‌’ పేరుతో అధికారులతో కలసి ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తామని, సంక్షేమ పథకాల అమలు, అవసరమైన పనులపై వాకబు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం 9 నెలలు జరుగుతుందన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేసి తీరుతామన్నారు. ప్రతి పేద కుటుంబానికి నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజీ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top