టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం

TDP Leaders Dramas In Sri Sathya Sai District - Sakshi

చిలమత్తూరు(శ్రీ సత్యసాయి జిల్లా): టీడీపీ నేతలు దిగజారిపోతున్నారు. ఏదో ఒక వంకతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు కుట్రలు చేస్తూనే ఉన్నారు. మండలంలోని సంజీవరాయునిపల్లికి చెందిన ఓ మహిళ టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా వైకల్య ధ్రువీకరణ పత్రం పొంది పింఛన్‌ మంజూరు చేయించుకుంది. ఈ విషయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దామోదర్‌ రెడ్డి ఇటీవల ఆమెను ప్రభుత్వానికి ఎందుకు నష్టం తెస్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన ఆమె కుమారుడు, టీడీపీ కార్యకర్త వేణు తప్పతాగి రెండు రోజుల క్రితం దామోదర్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగి దుర్భాషలాడాడు.

చదవండి: పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి..

దీనిపై దాము ఎస్‌ఐ రంగడుకు సమాచారం అందించగా, ఆయన ఇద్దరు కానిస్టేబుళ్లను గ్రామానికి పంపారు. వారిపైనా దౌర్జన్యానికి దిగిన వేణు లంచాలు తీసుకొనే ఎస్‌ఐ నన్ను రమ్మన్నాడా అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. ఇంతా చేసి, శనివారం దామోదర్‌రెడ్డిపైనే ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఎస్‌ఐ రంగడు.. తప్పుడు పనులు చేయడమే కాకుండా లంచగొండులమంటూ తమనే దూషిస్తావా అంటూ అతడిని మందలించారు.

ఈ విషయాలన్నింటినీ ముందస్తు ప్లాన్‌ ప్రకారం వేణుతో వచ్చిన టీడీపీ నాయకులు వీడియో తీసి సోషల్‌ మీడియా ద్వారా కుట్రకు తెరలేపారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ సైతం పోలీసు వ్యవస్థపై బురదజల్లే యత్నం చేశారు. పోలీసులపైనే దౌర్జన్యం చేసి నానా తిట్లు తిట్టిన వ్యక్తిని వెనకేసుకొస్తూ టీడీపీ నేతలు నాటకాలు చేస్తుండడంపై జనం విస్తుబోతున్నారు. సదరు మహిళ పింఛన్‌ తొలగించకున్నా, తొలగించారంటూ లోకేష్‌ నానా యాగీ చేయడంపై నవ్వుకుంటున్నారు. ఇదిలాఉంటే, వీడియో విషయమై స్పందించిన జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top