12 Years of Love: పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి..

Wife Protest In Front Of Husband House  - Sakshi

శ్రీకాకుళం: పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి.. ఎక్కడో హైదరాబాద్‌లో కొత్త కాపురం.. ఏడాది తిరిగే సరికి వివాదం.. చివరకు ఆ మహిళ భర్తను వెతుక్కుంటూ అత్తవారింటి ముందు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ రెల్లివీధిలో ఓ యువతి ఆదివారం అత్తవారి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. వివరాల్లోకి వెళితే.. కాశీబుగ్గ పాతజాతీయ రహదారిలో రెల్లివీధికి చెందిన భాను నాయక్‌కు రోటరీనగర్‌కు చెందిన సనపల మురళీకృష్ణతో ఏడాది కిందట వి వాహమైంది. 

దంపతులు హైదరాబాద్‌లో కా పురం ఉంటున్నారు. అయితే హఠాత్తుగా మురళీకృష్ణ ఆమెను విడిచిపెట్టి వచ్చేయడంతో భా ను న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించారు. పన్నెండేళ్ల కిందటి నుంచి తా ను మురళీకృష్ణ ప్రేమించుకున్నామని, 2021 లో పెళ్లి చేసుకోవాలని కోరితే ఆయన ఒప్పు కోకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని, డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, సీఐ శంకరరావు సమక్షంలో గత ఏడాది జనవరి 5న దండలు మార్చుకుని వివాహం చేసుకున్నామని తెలిపారు. 

పోలీసులు కౌన్సిలింగ్‌ మేరకు హైదరాబాద్‌లో ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నా మని చెప్పారు. అయితే ఆ ఇంటికి తాళం వేసి చెప్పా పెట్టకుండా మురళీకృష్ణ కాశీబుగ్గ వచ్చేశాడని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరా రు. ఇన్నాళ్లుగా తనకు మాయ మాటలు చెప్పి మభ్య పెడుతూనే ఉన్నారని, న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆమె తెలిపారు. భర్త ఇంటి ముందు బైఠాయించడంతో కాశీబుగ్గ పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు రక్షణ కల్పించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top