breaking news
muthukur spsr nellore district
-
రైతు కంట తడి పెట్టనివ్వను: మంత్రి కాకాణి
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా): వ్యవసాయశాఖ మంత్రిగా, రైతు బిడ్డగా రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కంట తడి పెట్టనివ్వకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాజకీయంగా జన్మనిచ్చి ఎదుగుదలకు ఆశీస్సులందించిన సర్వేపల్లి ప్రజానీకాన్ని కంఠంలో ప్రాణమున్నంత వరకు రుణపడి ఉంటానని కాకాణి అన్నారు. చదవండి👉: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం మంత్రి హోదాలో ఆదివారం సాయంత్రం తొలిసారిగా ముత్తుకూరుకు వచ్చిన కాకాణికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సభలో ఆయన ప్రసంగించారు. ఏ హోదాలో ఉన్నప్పటికీ నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.360 కోట్లతో సీసీరోడ్లు, సైడు డ్రెయిన్ల నిర్మాణం చేయించామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామన్నారు. ట్యాంకర్ల ద్వారా రవాణా చేసే దుస్థితి లేకుండా ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తున్నామన్నారు. ఇంటింటికీ కుళాయి పథకం అమలు చేస్తున్నామన్నారు. 80 రోజుల పాటు గ్రామాల్లో పర్యటన మే 10వ తేదీ తర్వాత ‘సిటిజన్ అవుట్‌రీచ్ కాంపైన్’ పేరుతో అధికారులతో కలసి ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తామని, సంక్షేమ పథకాల అమలు, అవసరమైన పనులపై వాకబు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం 9 నెలలు జరుగుతుందన్నారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసి తీరుతామన్నారు. ప్రతి పేద కుటుంబానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. -
‘నారాయణ’లో విద్యార్థుల తిరుగుబాటు
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, పిడతాపోలూరులోని నారాయణ రెసిడె న్షియల్ జూనియర్ కళాశాలలో సోమవారం అర్ధరాత్రి విద్యార్థులు బీభత్సం సృష్టించారు. కళాశాల నిర్వాహకుల నిర్వాకాన్ని నిరసిస్తూ ఆస్తులు ధ్వంసం చేశారు. వివరాలిలా ఉన్నాయి. కళాశాలలో మొత్తం 1,080 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 500 మందికిపైగా సీనియర్ ఇంటర్ విద్యార్థులున్నారు. కొంతకాలంగా కళాశాలలో సౌకర్యాల కొరతపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసూలు చేస్తున్న ఫీజులకు తగ్గట్టు భోజన వసతి లేకపోవడం, స్వగ్రామాల నుంచి వచ్చే తల్లిదండ్రులు, బంధువుల పట్ల ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి వారిని మరింత విసిగించింది. మంగళవారం పరీక్షలు ముగిసే జూనియర్లతో సీనియర్లు కలిశారు. రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. విద్యార్థుల్లో ఆవేశం పెల్లుబికింది. మూడుసార్లు విద్యుత్ సరఫరా(తొలగించారు)కు అంతరాయం ఏర్పడింది. జనరేటర్ మొరాయించింది. ఈ సమయంలో విద్యార్థులు కళాశాల అడ్మిన్ భవనంలో ఫర్నిచర్, ఏసీ మిషన్లు, ఫ్యాన్లు, గదులపైకప్పు సీలింగ్‌ను ధ్వంసం చేశారు. ప్రాంగణంలో వీధిలైట్లు పగులగొట్టారు. నిర్వాహకుల కారుపై విరుచుకుపడ్డారు. ల్యాబ్‌లో పరికరాలను నాశనం చేశారు. తరగతుల్లోని బెంచ్‌లు, కుర్చీలు, కిటికీ అద్దాలు విరగ్గొట్టారు. వసతిగృహం ఇన్చార్జ్ నాగార్జునపై దౌర్జన్యానికి దిగారు. పోలీసుల రంగప్రవేశం కళాశాల నిర్వాహకుల నుంచి సమాచారం రావడంతో ముత్తుకూరు, కృష్ణపట్నం ఎస్సైలు శ్రీనివాసరెడ్డి, విశ్వనాథరెడ్డి తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేశారు. కృష్ణపట్నం సీఐ శ్రీనివాసరావు కళాశాలకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ముందు జాగ్రత్తగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. జరిగిన బీభత్సం బయటకు పొక్కకుండా మంగళవారం ఉదయం కళాశాల ఉద్యోగులు చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ధ్వంసమైన పరికరాలు, ఫ్యాన్లు, బెంచ్‌లను తొలగించారు. జూనియర్ ఇంటర్ విద్యార్థులను పరీక్ష కోసం నెల్లూరుకు పంపారు. సీనియర్ విద్యార్థులను స్టడీ అవర్స్‌పై కూర్చోబెట్టారు. ఉద్యోగులు మీడియాతో ఎక్కువ మాట్లాడ కుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. కళాశాలలో ఏమీ జరగలేదు: ఏజీఎం కళాశాలలో ఎటువంటి సంఘటన జరగలేదని ఏజీఎం పద్మారెడ్డి విలేకరులతో అన్నారు. పరీక్షలు పూర్తయ్యే దశలో చిన్న సంఘటనలు జరగడం సహజమన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసుల సాయం కోరామని చెప్పారు. కళాశాల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నామన్నారు.