నేటి నుంచి వడగాడ్పులు | Meteorological officials said there would be heat winds in AP | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వడగాడ్పులు

Mar 23 2021 3:56 AM | Updated on Mar 23 2021 3:56 AM

Meteorological officials said there would be heat winds in AP - Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 15 మండలాల్లో మంగళవారం నుంచి వడగాడ్పులు ఉంటాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖలో సోమవారం 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎండలు మండుతున్నాయని, వేడిగాలులు ఉంటాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.

కొద్దిరోజులు ఇలాగే ఉంటుందని, ప్రస్తుతం గాలులు ఉత్తర దిశ నుంచి వీస్తున్నాయని తెలిపారు. సాధారణం కంటే 2 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రాయలసీమలో ఎండలు మరింత పెరిగే సూచనలున్నాయని అధికారులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement